Invite To Wrestlers : రెజ్లర్లను మళ్ళీ చర్చలకు ఆహ్వానించిన కేంద్రం

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లను కేంద్రం మరోసారి చర్చలకు(Invite To Wrestlers) ఆహ్వానించింది.

  • Written By:
  • Updated On - June 7, 2023 / 07:50 AM IST

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లను కేంద్రం మరోసారి చర్చలకు(Invite To Wrestlers) ఆహ్వానించింది. ఈవిషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం వెల్లడించారు. “రెజ్లర్ల సమస్యలపై చర్చకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. దాని కోసం నేను మరోసారి(Invite To Wrestlers) రెజ్లర్లను ఆహ్వానించాను” అని పేర్కొంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

Also read : Wrestlers Rejoin Work : తిరిగి జాబ్స్ లో చేరిన రెజ్లర్లు సాక్షి, వినేష్, పునియా

రెజ్లర్లు కేంద్ర  హోం మంత్రి అమిత్ షాను కలిసి  వచ్చిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఒలింపిక్స్ పతక విజేత, స్టార్  రెజ్లర్ బజరంగ్ పునియా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ”  మీటింగ్ విషయాల గురించి బయట మాట్లాడొద్దని మమ్మల్ని అమిత్ షా కోరారు” అని చెప్పారు. “నిరసన ఉద్యమం ఆగిపోలేదు.. అది కొనసాగుతుంది.. దానిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై మేము వ్యూహరచన చేస్తున్నాము” అని పునియా తెలిపారు. ఈ తరుణంలో మరోసారి రెజ్లర్లను మీటింగ్ కు కేంద్రం ఆహ్వానించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.