Site icon HashtagU Telugu

Thalliki Vandanam : రూ.15,000 నగదు ట్రాన్స్‌ఫర్‌కు ఏర్పాట్లు పూర్తి

Thalliki Vandanam

Thalliki Vandanam

Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. విద్యారంగ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని, విద్యార్థుల తల్లులను ఆర్థికంగా ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ పథకం జూన్ నెలలోనే ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15,000 నగదు నేరుగా జమ చేయనుంది. ఈ నిధులు విద్యార్థుల విద్యా ఖర్చుల నిమిత్తం ఉపయోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ పథకానికి ఉద్దేశ్యంగా పేర్కొంది.

Covid-19: తెరుచుకోనున్న పాఠశాలలు.. వైద్యశాఖ కీలక సూచనలు..!

బ్యాంక్ ఖాతా లింకింగ్ తప్పనిసరి
పథకాన్ని సజావుగా అమలు చేయడానికి తల్లుల బ్యాంక్ ఖాతాలను ఆధార్ నంబర్‌తో పాటు ఎన్పీసీఐ (NPCI)తో లింక్ చేయడం తప్పనిసరిగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియను జూన్ 5లోపు పూర్తిచేయాలి. లింకింగ్ ప్రక్రియ పూర్తైతేనే నగదు వారి ఖాతాల్లోకి జమవుతుంది.

ఎలా లింక్ చేయాలి?
ఈ ప్రక్రియకు సంబంధించి తల్లులు తమకు సమీపంలోని పోస్టల్ కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాలు లేదా బ్యాంకు శాఖలను సంప్రదించవచ్చు. అధికారుల సూచనల మేరకు అవసరమైన పత్రాలతో హాజరై ఖాతా లింకింగ్‌ను వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.

లక్ష్యంగా విద్యా ప్రోత్సాహం
తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం ద్వారా విద్యార్థుల విద్యా పరమైన అవసరాలు తీర్చడంలో కుటుంబాలకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ పథకం విద్యార్థుల చదువుపై మరింత దృష్టి పెట్టేలా చేస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

MLC Kavitha : సీఎం రేవంత్ జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండటం దారుణం