Cabinet Expansion: కేబినెట్ విస్తరణ.. వారికి నిరాశే..

Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఆశలు పెట్టుకున్న పలువురు నేతలకు తీవ్ర నిరాశే ఎదురైంది.

Published By: HashtagU Telugu Desk
Cabinet

Cabinet

Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఆశలు పెట్టుకున్న పలువురు నేతలకు తీవ్ర నిరాశే ఎదురైంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు మంత్రిపదవుల కోసం బలమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, వారికి అవకాశం దక్కలేదు. పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఈ నేతలు చివరకు వెనకడుగు వేయాల్సి వచ్చింది.

Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

అంతేకాకుండా ఎమ్మెల్సీలుగా ఉన్న అద్దంకి దయాకర్, విజయశాంతి వంటి ప్రముఖుల పేర్లు కూడా విస్తరణకు ముందు చర్చల్లో బాగా వినిపించినా, ఆ ఖాతాలో వారు చేరకపోవడం గమనార్హం. పార్టీ అంతర్గత సమీకరణలు, సామాజిక సమతుల్యత లాంటి అంశాలు ఈ నిర్ణయాల్లో ప్రభావం చూపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న ఈ నాయకులకు మరికొంత కాలం ఎదురుచూడక తప్పదని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ వర్గీకరణలు, శక్తిసామర్థ్యాల ఆధారంగా తీసుకునే నిర్ణయాల్లో తమకు అన్యాయం జరిగిందన్న భావన ఈ నేతల్లో కనిపిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో మరో అవకాశం దక్కే ఆశను మాత్రం వీళ్లు వదులుకోవడం లేదు.

D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్‌.. భార‌త్ నుంచి కొనుగోలుకు సిద్ధ‌మైన తైవాన్!

  Last Updated: 08 Jun 2025, 10:58 AM IST