West Africa: అప్పటి వరకే అంతా బాగానే ఉంది.. కానీ అంతలోనే ఊరు మొత్తం అలా?

మామూలుగా సమాజంలో, జీవితంలో జరిగే కొన్ని రకాల భయంకరమైన సంఘటనలు చూస్తే ఇది నిజమా లేక కలనా అన్న అనుమానం వేయక మానదు. ఎందుకంటే మన

Published By: HashtagU Telugu Desk
West Africa

West Africa

మామూలుగా సమాజంలో, జీవితంలో జరిగే కొన్ని రకాల భయంకరమైన సంఘటనలు చూస్తే ఇది నిజమా లేక కలనా అన్న అనుమానం వేయక మానదు. ఎందుకంటే మన చుట్టూ జరిగే కొన్ని రకాల సంఘటనలను అంత తేలికగా మనం మర్చిపోలేము. అప్పటివరకు ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా బీభత్సంగా మారిపోతే ఆ సంఘటన ఊహించుకోవడానికి కాస్త భయంకరంగా ఉంటుంది. అలాంటి సంఘటనే ఆఫ్రికాలో చోటు చేసుకుంది.

ఊరు ఊరు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.. వినడానికి ఆశ్చర్యంగా షాకింగ్ గా ఉంది కదూ. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న గ్రామం న్యోస్‌. అస్సలు ఊహించలేదు వారంతా అదే తమకు చివరి రాత్రి అని. ఏమైందో ఏమో సడెన్‌గా పశువులు, జంతువులు మనుషులు ఎక్కడివాళ్లు అక్కడే విగతజీవుల్లా మారిపోయారు. ఎందుకు అంతా అలా చనిపోతున్నారు, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఊరు ఊరు మొత్తం వల్ల కాడు అయింది. వేళ్లపై లెక్కపెట్టేంత మందే బతికారు. ఆయా వ్యక్తులు తమ వాళ్లంతా చనిపోతే ఆ శవాల మధ్య బిక్కుబిక్కుమంటూ నిస్సహాయంగా ఉండిపోయారు. ఒక్కసారిగా ఆ గ్రామం​ అంతా అత్యంత నిశబ్దంలోకి వెళ్లిపోయింది.

ఆ అనూహ్య ఘటనతో ఓ మహిళ ఏడుస్తూ పిచ్చి పట్టినట్లుగా బట్టలు చింపుకుని వింతగా ప్రవర్తించింది. హలీమా అనే మహిళ, కొందరూ వ్యక్తులు తప్ప అంత నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. అంతమంది ఒకేసారి చనిపోయిన ఎవ్వరిపై ఒక్క ఈగ కూడా వాల్లేదు. ఇది అత్యంత ఆసక్తి రేపే కీలక అంశం. కనీసం కీటకాలు గానీ ఏవిలేవు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అందరూ ఒక్కొక్కరిగా చనిపోయినట్లు నాటి భయనక ఘటనలు గుర్తు చేసుకున్నారు ఆ వ్యక్తులు. ఈ ఘటన 1986లో జరిగింది. ఈ విషయం దావనంలా వ్యాపించింది. మొత్తం గ్రామమే తుడిచిపెట్టుకుపోవడం అక్కడ ఒక వింత ఘటనగా చర్చనీయాంశంగా మారిపోయింది.

ఆ ఘటనలో ఒకేసారి దాదాపు 1,746 మంది దాక చనిపోగా సుమారు 3,500 వ్యవసాయ జంతువులు చనిపోయాయి. ఆ గ్రామం సమీపంలో న్యాస్‌ అనే సరస్సు ఉందని, దానిలోంచి కార్బన్‌ డయాక్సైడ్‌ ఫ్రీక్‌ ఫ్లూమ్‌ పెరగడంతోనే అందరూ మరణించినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తం 1.6 మిలియనల​ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్ విడుదలైందని, సరిగ్గా లోయకు సమీపంలోని వ్యక్తులంతా పీల్చడంతోనే చనిపోయారని అన్నారు. అయితే ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు మాత్రం సరస్సు నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చినట్లు చెప్పారు. మరికొంత మంది ఈ ఘటన తరువాత రోజు ఒక్కొక్కరుగా చనిపోయారు. అలాగే ఆ న్యాస్‌ నది జలాలు కూడా ఆ రోజు నీలిరంగుకు బదులు ఎరుపు రంగులోకి మారిపోయింది. ఇలాంటి భయానక ఘటనలు యూఎస్‌లో చాలా జరిగాయి. అయితే శాస్త్రవేత్తలు సైతం వాటిని అంతుపట్టని సహజ మరణాలుగా తేల్చారు.

  Last Updated: 22 Aug 2023, 04:24 PM IST