ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 10 గంటలకు పైగా ఈడీ అధికారులు కవితను విచారిస్తున్నారు. ఇంకా విచారణ ముగియకపోవడంతో ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈడీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణ అడిషనల్ ఏజీ, లాయర్లు భరత్ చేరుకున్నారు. సౌత్ గ్రూప్‌లో ఆర్థిక లావాదేవీలపై కవితను ఈడీ ప్రశ్నిస్తున్నారు. ఉదయం అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం నుంచి మనీష్ సిసోడియా, అరోరాతో కలిపి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణ ఇంకా కొనసాగుతుండటంతో ఈడీ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కవిత బయటకు వస్తుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతుంది.
Delhi : ఢిల్లీ ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్.. పది గంటలకు కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

More Evidence For Kavitha's Arrest! Business Partner Pillai's Ed Beds