Telugu States CMs : నేడు ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ

తమ రాష్ట్రాలకు నిధులు తదితర అంశాల ఫై వీరు మోడీ తో సమావేశం కానున్నారు

Published By: HashtagU Telugu Desk
Telugucmmodi

Telugucmmodi

నేడు ప్రధాని మోడీ (PM Modi) తో తెలుగు రాష్ట్రాల సీఎం లు చంద్రబాబు (CBN) , రేవంత్ రెడ్డి (Revanth Reddy) లు వేరు వేరుగా సమావేశం కాబోతున్నారు. తమ రాష్ట్రాలకు నిధులు తదితర అంశాల ఫై వీరు మోడీ తో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​కుమార్‌ ప్రసాద్‌, ఇతర అధికారులు ఢిల్లీకి వెళ్లడం జరిగింది.

గత జగన్ ప్రభుత్వంలో జరిగిన ఆక్రమణలు , నష్టాల గురించి మోడీకి వివరించి, ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయడం, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీరు వంటి అంశాలపై విజ్ఞప్తులు చేయబోతున్నారు. మరికాసేపట్లో మోడీ తో బాబు సమావేశం కానున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రేపు శుక్రవారం ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, 10 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, 10:45 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను, 12 : 30 గంటలకుమంత్రి అఠవాలేలను చంద్రబాబు కలవనున్నారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్‌ రాయబారితోనూ సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్​కు వెళ్తారు. శనివారం విభజన సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అవుతారు.

ఇక తెలంగాణ సీఎం రేవంత్ సైతం నిన్నటి నుండి ఢిల్లీ లో బిజీ బిజీ గా ఉన్నారు. ఈయన కూడా ఈరోజు ప్రధాని మోడీ తో సమావేశం కానున్నారు. గతవారమే ఇరువురు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ లోక్‌సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదా పడింది. నేటి సాయంత్రం ప్రధానితో భేటీకి సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ లభించింది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, అభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను సీఎం ప్రధానికి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Read Also : Mint Water: గ్యాస్ సమస్యతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఈ పని చేయాల్సిందే?

  Last Updated: 04 Jul 2024, 10:37 AM IST