Telegram APP : టెలిగ్రామ్ లో ఈ అద్భుతమైన ఫీచర్ల గురించి మీకు తెలుసా..?

వాట్సాప్ యాప్ మాధురి ఈ మధ్యకాలంలో యూజర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మరొక యాప్ టెలిగ్రామ్.

Published By: HashtagU Telugu Desk
I2odshbs (1)

I2odshbs (1)

వాట్సాప్ యాప్ మాధురి ఈ మధ్యకాలంలో యూజర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మరొక యాప్ టెలిగ్రామ్. రోజుకి ఈ టెలిగ్రామ్ వాడే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఇక టెలిగ్రామ్ సంస్థ వారు కూడా వాట్సాప్ లో లేని ఫీచర్ ఇదని కూడా టెలిగ్రామ్ లి తీసుకుని వస్తున్నారు. ఇప్పటివరకు టెలిగ్రామ్ లో సేవలు అందరికీ ఉచితం అయినప్పటికీ త్వరలో టెలిగ్రామ్ పెయిడ్ వర్షన్ కూడా రాబోతోంది. ఈ పరిణామాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు అయిన పావెల్ దురోవ్ దృవీకరించారు.

ప్రతి ఒక్క యూజర్ ని ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతిస్తే అప్పుడు వారి సర్వర్లు రద్దు నిర్వహణకు అయ్యే ఖర్చులు భరించలేనంతగా పెరిగిపోతాయని అందుకే అందరికీ అన్ని ఉచితంగా లభించవు అని పావెల్ దురోవ్ తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఉన్న సదుపాయాలను ఉచితంగా అందిస్తూ అదనంగా తీసుకువచ్చే కొన్ని కొత్త సదుపాయాలను పెయిడ్ వెర్షన్ ఆప్షన్ కు పరిమితం చేస్తామని తెలిపారు. ప్రతి నెల చెల్లించడం ద్వారా టెలిగ్రాం ఫీడ్ సేవలను పొందే వీలు ఉంటుంది అని తెలిపారు. ఇక ఈనెల ఆఖర్లో టెలిగ్రాం పెయిడ్ వర్షన్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

  Last Updated: 11 Jun 2022, 04:50 PM IST