Site icon HashtagU Telugu

DSC Protest: డీఎస్సీ అభ్యర్థుల నిరసనలో పాల్గొన్న ఎస్ఐఓ

Dsc Protest (1)

Dsc Protest (1)

DSC Protest: సీఎం కేసీఆర్ ప్రకటించిన 13086 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డీఎస్సీ అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్నారు. కేసీఆర్ ప్రకటించిన ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్ ను రద్దుచేసి, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా డీఎస్సీ అభ్యర్థులతో కలిసి తెలంగాణ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉర్దూ మీడియం డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఎస్‌ఐఓ తెలంగాణ పీఆర్‌ సెక్రటరీ అబ్దుల్‌ రెహమాన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రయోజనాల కోసమే డీఎస్సీ పోస్టులను విడుదల చేశారన్నారు. ఇది సరైన డీఎస్సీ కాదు. మెగా డీఎస్సీ నిర్వహించాలని ఉర్దూ మీడియం సీట్లను డీ-రిజర్వ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాంమని తెలిపారు. ఆర్టీఏ ప్రకారం డీఎస్సీ నిర్వహించాలి. డైట్ కాలేజీల్లోని చాలా పోస్టులకు ఫ్యాకల్టీ లేరు, గెస్ట్ ఫ్యాకల్టీ సీట్లు కూడా చాలా ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా రాబోయే ఉపాధ్యాయులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ నిరసనలో ప్రొఫెసర్ కోందండరామ్ కూడా పాల్గొన్నారు. డీఎస్సీ ఆశావహులకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Chaiyya Chaiyya Song : ‘ఛయ్యా.. ఛయ్యా’ సాంగ్ మహేష్ బాబు కజిన్ చేయాల్సింది.. కానీ చివరికి మలైకా ఎంట్రీ..