Telangana: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మహ్మద్ షబ్బీర్ అలీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీకి రాష్ట్ర దేవాదాయ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మల్లు రవి , జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి నవీన్ నికోలస్ , పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Malkajgiri MP: మల్కాజిగిరి ఎంపీ బరిలో బొంతు రామ్‌మోహన్