IMD Alert :తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సాయంత్రం నాటికి కొన్నిచోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. నగర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, వర్షం సమయంలో అనవసరంగా బయటకు రావద్దని సూచించింది.
Rishabh Pant: రిషబ్ పంత్‌కు షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. కెప్టెన్‌గా మరో ఆటగాడు..!
నిన్న జరిగిన వర్షాల నేపథ్యంలో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం గణనీయంగా నమోదైంది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని లచ్చపేటలో 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 5.6 సెంటీమీటర్లు, పాల్వంచ మండలంలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇప్పటికైతే, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందజేసింది.
Flexi, posters : ఫ్లెక్సీలు, పోస్టర్ల నిషేధం .. త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తాం: మంత్రి నారాయణ
ఇదిలా ఉంటే.. IMD సూచనల ప్రకారం అక్టోబర్ 22న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం కింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ వివరించారు. ఈ నేపథ్యంలోనే.. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల , పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.