Junior Assistant: జూనియర్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వ దసరా కానుక.. ఈవోలుగా ప్రమోషన్..

Junior Assistant: దసరా పండుగకు ముందు, ఈ ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 134ను విడుదల చేసింది. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఆ ఉద్యోగులు పదోన్నతి పత్రాలు అందుకున్నారు. పదోన్నతి రావడంతో నూతన ఈవోలు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తామని చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Konda Surekha

Konda Surekha

Junior Assistant: తెలంగాణ సర్కార్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పదోన్నతుల కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న 33 మంది జూనియర్ అసిస్టెంట్లు గ్రేడ్-3 ఈవోలుగా పదోన్నతి పొందారు. దసరా పండుగకు ముందు, ఈ ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 134ను విడుదల చేసింది. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఆ ఉద్యోగులు పదోన్నతి పత్రాలు అందుకున్నారు. పదోన్నతి రావడంతో నూతన ఈవోలు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తామని చెప్పారు.

Shazia Ilmi : మహిళ సీఎంగా రాష్ట్రం మహిళలకు సురక్షితం కాకపోవడం ‘సిగ్గుచేటు’

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, ఇది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. గ్రేడ్-1, గ్రేడ్-2 ఈవోలుగా ఇప్పటికే పలువురికి ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేస్తూ, ఉద్యోగులు దేవాలయాల అభివృద్ధికి, వాటి ఆస్తుల సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులను అణచివేతకు గుర్యయ్యరని ఆమె మండిపడ్డారు. దేవాలయాల ప్రగతికి, దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఉద్యోగులు పునరంకితం కావాలని మంత్రి సురేఖ కోరారు. అయితే.. ఈవోలుగా బాధ్యతలు చేపట్టిన జూనియర్‌ అసిస్టెంట్లు దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.

అంతేకాకుండా.. దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి, దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ వంటి నిర్ణయాలతో దేవాదాయ శాఖ ఆస్తులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కోర్టు కేసుల్లో ఉన్న దేవాలయ భూములకు విముక్తి ప్రసాదించేందుకు తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ లీగల్ ఆఫీసర్‌ను నియమించనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంత రావు, అడిషనల్ కమిషనర్‌లు కృష్ణవేణి, జ్యోతి, దేవాదాయ శాఖ దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్, పదోన్నతి పొందిన జూనియర్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Jerry In Tirumala Annadanam Center: తిరుమల అన్నదాన కేంద్రంలో జెర్రి క‌ల‌క‌లం.. వీడియో

  Last Updated: 06 Oct 2024, 09:18 AM IST