Duddlla Sridhar Babu : తెలంగాణ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పేది కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం అని ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణ ఇప్పుడు ప్రతిభకు చిరునామాగా మారిందని ఆయన అన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయొద్దని, తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు వారికి కనిపించడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని, తమ ప్రోత్సాహకాలు చూసే శైవ గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని మంత్రి వెల్లడించారు. 1300 కోట్ల రూపాయలతో ఒక బయోటెక్ సంస్థ పెట్టుబడులు పెడుతోందని, మొత్తం ఐదు సంస్థల్లో 2100 కోట్ల రూపాయల పెట్టుబడులతో 5 వేల మందికి పైగా ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు.
Congress : సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శం: దానం నాగేందర్
సాంకేతిక ఆవిష్కరణలకు ప్రభుత్వం పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తుందని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. గడచిన 18 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు (MOUలు) కుదిరాయని, దీని ద్వారా లక్ష మంది తెలంగాణ యువతకు ఉపాధి లభించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అడుగు నుంచే విమర్శలు చేస్తోందని, అయితే తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చూపిస్తున్నామని ఆయన నొక్కి చెప్పారు.
‘పెట్టుబడులు రావడం లేదు, కంపెనీలు పోతున్నాయి’ అనే విమర్శలకు తమ ప్రభుత్వం సాధించిన ఈ విజయాలు కౌంటర్ అని మంత్రి అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో యువతకు మరింత ఉపాధి లభిస్తుందని, తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం మానుకోవాలని, పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీయొద్దని మంత్రి కోరారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో పెట్టుబడులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.