Telangana: కాంగ్రెస్ మంత్రుల జాబితా ఇదేనా

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ 64 ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతుంది. మంత్రులుగా క్యాబినేట్లోకి కొంతమంది పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి కాగా ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్ధికశాఖమంత్రిగా భట్టి విక్రమార్క

Published By: HashtagU Telugu Desk
Bhatti Sithakka

Bhatti Sithakka

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ 64 ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతుంది. మంత్రులుగా క్యాబినేట్లోకి కొంతమంది పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి కాగా ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్ధికశాఖమంత్రిగా భట్టి విక్రమార్క పదవి చేపడతారు. షబ్బీర్ అలీ ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తెలంగాణ హోంమంత్రిగా సీతక్క ఎన్నికయ్యారు. వివేక్ వెంకట స్వామి- బీసీ SC వెల్ఫేర్ శాఖ మంత్రి, పెద్ది సుదర్శన రెడ్డి- వ్యవసాయ సహకార శాఖ మంత్రి, దూదిళ్ళ శ్రీధర్ బాబు- ఆరోగ్య శాఖ మంత్రి, మైనంపల్లి హనుమంతరావు -పర్యటన శాఖ మంత్రిగా ఉండనున్నారు. అలాగే జగ్గా రెడ్డి- అటవీ శాఖ మంత్రిగా, అజరుద్దీన్- క్రీడల శాఖ మంత్రిగా, జూపల్లి కృష్ణారావు- పశుసంవర్ధక శాఖ మంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి- పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా, వెంకట్ రెడ్డి- మున్సిపల్ శాఖ మంత్రిగా, కొండ సురేఖ- శ్రీ శిశు శాఖ మంత్రిగా కొనసాగుతారు. సీనియర్ నాయకులూ తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి – భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా, వెం నరేంద్ర రెడ్డి- విద్య శాఖ మంత్రిగా, అద్దంకి దయాకర్- కార్మిక శాఖ మంత్రిగా, దామోదర రాజనర్సింహ- శాసనసభపతిగా, పొందేం వీరయ్య- డిప్యూటీ స్పీకర్ గా పదవి చేపట్టనున్నారు.

Also Read: Cyclone Michaung: తుపాను ముంచుకొస్తోంది..ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్

  Last Updated: 04 Dec 2023, 11:57 PM IST