Dashabdi Utsavalu: దశాబ్ది ఉత్సవాలు కాదు…దశాబ్ది దగా ఉత్సవాలు..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కొత్తగూడెంలో

Dashabdi Utsavalu: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కొత్తగూడెంలో యం.జి రోడ్డు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో, పది తలల కెసిఆర్ దిష్టి బొమ్మని తలబెట్టి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్ నందు ఇంచార్జీకి వినతి పత్రం అందజేశారు టిపిసిసి సభ్యులు.

ఇక తెలంగాణ దశాబ్ది వేడుకలను నిరసిస్తూ హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సిటీ సెంటర్ వద్ద “దగా దశాబ్దికి రావణ వధ”నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ,కేసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏం సాధించారని ఉత్సవాలు చేస్తున్నారని నిలదీశారు డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్. వేములవాడ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా 10 తలల రావణుడి ఆకారంలో ఉన్న కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

Read More: Milk : పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?