Site icon HashtagU Telugu

YS Sharmila: తెలంగాణా ఆప్ఘనిస్తాన్, కేసీఆర్‌ తాలిబన్‌.. వైఎస్‌ షర్మిల షాకింగ్ కామెంట్స్!

Asdas

Asdas

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో భారత రాజ్యం అమలవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తాలిబన్‌గా అభివర్ణించింది. ఇవాళ షర్మిలను మహబూబాబాద్‌లో అరెస్ట్‌ చేసిన పోలీసులు, ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న కారణంతో, వైఎస్‌ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జాకోరని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శంకర్‌నాయక్ అభ్యంతరకరంగా మాట్లాడారని, ఓ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన పదమేనా అని ప్రశ్నించారు. వాళ్లంటే తప్పులేదా మేమంటేనే తప్పా?.. మహిళలు అంటే అంత చిన్నచూపా? ఆడవాళ్లు అయితే ప్రశ్నించకూడదా? అని షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ అని ధ్వజమెత్తారు.

ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేశారు. దీంతో మహబూబాబాద్‌ సమీపం బేతోలులో దగ్గర షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కారవాన్‌లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు వదిలేశారు. ఈ సందర్భంగా మీడియోతో మాట్లాడిన షర్మిల… కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏమైనా ఆప్ఘనిస్తానా అన్నారు. కేసీఆర్‌ తాలిబన్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ఆటలు సాగవని హెచ్చరించారు. తెలంగాణలో భారత రాజ్యం అమలు చేయాలన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ రాజ్యం అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

Exit mobile version