Ministers: తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..?!

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డితో ప‌లువురు ఎమ్మెల్యేలు మంత్రులు (Ministers)గా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

  • Written By:
  • Updated On - December 7, 2023 / 10:23 AM IST

Ministers: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డితో ప‌లువురు ఎమ్మెల్యేలు మంత్రులు (Ministers)గా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ్మ, కొండా సురేఖ ప్రమాణం చేయ‌నున్నారు. తెలంగాణ కేబినెట్ లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలు అందించారు. వీరంతా రేవంత్ తో పాటు కాసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read: Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ఓడించింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 64 స్థానాలను గెలుచుకోగా, రాష్ట్రంలోని మెజారిటీ సంఖ్య 60 స్థానాలు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 39 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో పాటు బీజేపీ 8, ఏఐఎంఐఎం 7, సీపీఐ 1 సీట్ గెలుచుకున్నాయి.

అధికారిక కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్

ఢిల్లీ నుంచి బుధవారం రాత్రికి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ రెడ్డికి సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా స్వాగతం పలికారు. ఆయ‌న‌కు అధికారికంగా ఏర్పాటు చేసే కాన్వాయ్‌ని సిద్ధం చేయగా.. రేవంత్ వ‌ద్ద‌ని వారించారు. తాను ఇంకా ప్రమాణం చేయ‌నందున వ‌ద్దంటూ, మాణిక్‌రావ్‌ ఠాక్రేతో కలిసి సొంత వాహనంలో విమానాశ్రయం నుంచి బయలుదేరారు. అయితే భద్రతా కారణాలరీత్యా రేవంత్‌ వాహనాన్ని అధికారిక కాన్వాయ్ అనుస‌రించింది.

We’re now on WhatsApp. Click to Join.