Site icon HashtagU Telugu

Sai Dharam Tej : నారా లోకేష్ ను కలిసిన మెగా హీరో

Sai Dharam Tej Nara Lokesh

Sai Dharam Tej Nara Lokesh

Sai Dharam Tej Goes to Lokesh With A Cheque : మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)..బుధువారం మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ను కలిశారు. ఇటీవల విజయవాడ లో భారీ వర్షం (Vijayawada Floods) కురిసి అపార నష్టం మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు దాతలకు పిలుపునిచ్చారు. దీంతో సినీ , బిజినెస్ , రాజకీయ ఇలా అనేక రంగాల వారు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందజేస్తూ వస్తున్నారు. ఇక చిత్రసీమ నుండి కూడా పెద్ద ఎత్తున స్పందించారు. వారిలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒకరు.

ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తనవంతు సాయంగా హీరో సాయి ధరమ్ తేజ్ రూ. 10 లక్షలు ప్రకటించడం జరిగింది. తాజాగా ఆయన ఏపీ మంత్రి లోకేశ్ ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్ను అందించారు. ‘ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చిన చెక్ను లోకేశ్ అన్నకు అందించా’ అని ట్వీట్ చేశారు. అలాగా సేవా సంస్థలకు ప్రకటించిన రూ. 5 లక్షల్లో అమ్మ అనాథశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా సాయిదుర్గ తేజ్ రూ. 10 లక్షల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also : Telangana Cabinet Expansion : క్యాబినెట్ విస్తరణ.. ఎవర్ని పదవి వరిస్తుందో..?