Site icon HashtagU Telugu

IND vs SL: ఆసియా కప్ లో కీలక మ్యాచ్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా!

New Web Story Copy 2023 09 12t145804.602

New Web Story Copy 2023 09 12t145804.602

IND vs SL: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సూపర్-4లో శుభారంభం చేసింది. ఆసియా కప్ 2023లో సూపర్-4 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 238 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు రెండో మ్యాచ్‌లో ఆ జట్టు శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధిస్తే ఆ ఫైనల్ కు చేరుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ (8), గిల్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌ ఆడడం భారత ఆటగాళ్లకు అంత సులువు కాదు. సెప్టెంబర్ 11వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ముగిసింది. అయితే కేవలం 16 గంటల్లోపు శ్రీలంకతో జట్టు తలపడనుండటంతో భార పడనుంది.

పాకిస్థాన్‌పై టీమిండియా టాప్-4 బ్యాట్స్‌మెన్‌లందరూ 50 పరుగులకు పైగా ఇన్నింగ్స్ ఆడారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక బౌలర్లకు గట్టి సవాలు ఎదురుకానుంది. పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలు చేశారు. రాహుల్ 6 నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు అతను ఫామ్‌లోకి రావడం టీమ్ ఇండియాకు ఉపశమనం కలిగించింది.

రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు. శ్రేయాస్ అయ్యర్ ఇంకా పూర్తిగా ఫిట్ గా లేడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతను నిర్వర్తించడం చూడవచ్చు. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ ప్లేయింగ్-11లో చోటు సంపాదించవచ్చు. ఇండియా, శ్రీలంక మ్యాచ్‌ను స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Also Read: Virat Kohli Records: కోహ్లీ చెలరేగితే సచిన్ 100 సెంచరీల రికార్డును బద్ధలు కొట్టడం ఖాయమే!