టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 14న కోవూరు నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 15న నెల్లూరులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్ష చేయనున్నారు. 16న వెంకటగిరి, శ్రీకాళహస్తిలో బాదుడే బాదుడు ర్యాలీలో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద మినీ మహానాడుకు జిల్లా నేతలు స్థలాన్ని పరిశీలించారు.
Chandrababu Tour : నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారు

nellore tdp