Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (Bachula Arjunudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.

Published By: HashtagU Telugu Desk
Resizeimagesize (1280 X 720) 11zon (1)

Resizeimagesize (1280 X 720) 11zon (1)

తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (Bachula Arjunudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు బచ్చుల అర్జునుడుకు స్టంట్ వేసి చికిత్స అందిస్తున్నారని సమాచారం.

Also Read: 24 Dead: కొండపై నుండి పడిపోయిన బస్సు.. 24 మంది దుర్మరణం

విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు రమేష్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బచ్చుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అర్జునుడికి బీపీ ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా అర్జునుడు పనిచేశారు. గన్నవరం  అసెంబ్లీకి టీడీపీ ఇంచార్జీగా బచ్చుల అర్జునుడు కొనసాగుతున్నారు.

  Last Updated: 29 Jan 2023, 09:34 AM IST