Site icon HashtagU Telugu

Chandrababu : TDP క్యాడర్ సంయమనం పాటించాలి – చంద్రబాబు

Cbn Tdp

Cbn Tdp

టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో కూటమి శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈ ఐదేళ్లలో తమను అనేక బాధలకు, ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నేతలపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంతో పలు ఘర్షణలు జరుగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో ఆయన నివాసం ఉంటున్న ఓ అపార్ట్మెంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వంశీ బయటకు రావాలి అంటూ నినాదాలు చేశారు. వంశీని వదిలేది లేదంటూ హెచ్చరించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద కూడా టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు విసిరారు. దీంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత పెంచారు. ఇలా అనేక చోట్ల ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకోవడం తో వీటిపై చంద్రబాబు అరా తీశారు.

వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి….ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పూర్తి సంయమనం పాటించాలని అన్నారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read Also : T20 World Cup 2024: భారత్ – పాక్ మ్యాచ్.. ఐసీసీ కీలక నిర్ణయం