Site icon HashtagU Telugu

Tata-Apple iPhone : ఐఫోన్స్ ఉత్పత్తిలోకి టాటా గ్రూప్.. రూ.4942 కోట్లతో “విస్ట్రోన్” బెంగళూరు ప్లాంట్ కొనుగోలు ?

Tata Apple Iphone

Tata Apple Iphone

Tata-Apple iPhone : ఉప్పు.. పప్పు.. ఇంటర్నెట్.. ఐటీ.. ఇలా అన్ని ఫీల్డ్స్ లో టాటా గ్రూప్ ఉంది..  

టాటా గ్రూప్ ఇప్పటికే తమిళనాడులోని తమ ఫ్యాక్టరీలో ఐఫోన్ చాసిస్ లను ఉత్పత్తి చేస్తోంది.  

త్వరలోనే యాపిల్ కంపెనీ ఐఫోన్స్ ను కూడా టాటా గ్రూప్ ఉత్పత్తి చేయబోతోంది.. 

ఇప్పటివరకు మనదేశంలో ఫ్యాక్టరీలు పెట్టి ఐఫోన్స్ ను ఉత్పత్తి చేస్తున్నవన్నీ చైనా, తైవాన్ కంపెనీలే. 

త్వరలో ఆ ఫోన్ల ప్రొడక్షన్ విభాగంలోకి  జంప్ చేయనున్న తొలి భారత కంపెనీగా మన టాటా గ్రూప్ నిలువనుంది.     

తైవాన్ కంపెనీ విస్ట్రోన్ (wistron)కు బెంగళూరులో ఐఫోన్స్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ తన ప్లాంట్ ను టాటా గ్రూప్ కు అమ్మేసే ఆలోచనలో ఉంది. గత ఏడాది కాలంగా దీనిపై టాటా గ్రూప్ తో విస్ట్రోన్  చర్చలు జరుపుతోంది. ఆగస్టు చివరికల్లా ఈ చర్చలు కొలిక్కి వస్తాయనే అంచనాలు వెలువడుతున్నాయి.  ఐఫోన్స్ తయారు చేసే ఆ ప్లాంట్ ను రూ.4942 కోట్లకు టాటా గ్రూప్ కొనే అవకాశం ఉందని(Tata-Apple iPhone) అంటున్నారు. ఈ ప్లాంట్ లో దాదాపు 10వేల మందికిపైగా కార్మికులు, సిబ్బంది  పనిచేస్తున్నారు. iPhone 14 మోడల్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీ కూడా ఈ ప్లాంట్ లో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ లో (3 నెలల్లో)  విస్ట్రోన్   గ్రూప్  దాదాపు రూ.4వేల కోట్ల విలువైన ఐఫోన్‌లను ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసింది.

Also read : Political Civil Code : కాంగ్రెస్ వైపు KCR అడుగు

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించాల్సి ఉన్న రాయితీలు, ప్రోత్సాహకాల కోసం 2024 మార్చి వరకు ఈ ఫ్యాక్టరీ విస్ట్రోన్  ఆధీనంలోనే ఉండే అవకాశం ఉందని  అంటున్నారు.అప్పటివరకు రూ.14వేల కోట్ల విలువైన  ఐఫోన్లను విస్ట్రోన్ ఉత్పత్తి చేయనుంది. ఐఫోన్ల ఉత్పత్తిని పెంచేందుకుగానూ వచ్చే ఏడాది నాటికి సిబ్బంది సంఖ్యను కూడా మూడు రెట్లు పెంచాలని విస్ట్రోన్  భావిస్తోంది. ఒకవేళ టాటా గ్రూప్  కు బెంగళూరు ప్లాంట్ ను విక్రయించే డీల్ కుదిరినా.. వచ్చే ఏడాది వరకు ఉత్పత్తి యాక్టివిటీని  విస్ట్రోన్  స్వయంగా చేపడుతుందా ? టాటా గ్రూప్ కు ప్లాంట్ అప్పగించి వైదొలుగుతుందా ? అనే దానిపై ఇంకా  క్లారిటీ లేదు.