Taliban Vs Chess : ఆఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంకో గేమ్‌ను తాలిబన్ సర్కారు బ్యాన్ చేసింది. అదే.. చెస్. ఇకపై చెస్‌ను దేశంలో ఎవరూ ఆడొద్దని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. మతపరమైన కారణాల వల్లే చెస్‌ను బ్యాన్ చేస్తున్నట్లు తాలిబన్లు వెల్లడించారు. మే 11 నుంచే ఈ బ్యాన్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ వివరాలను ఆఫ్ఘనిస్తాన్ క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ధ్రువీకరించారు.
Also Read :PM Modi : కాసేపట్లో భారత్ – పాక్ డీజీఎంఓల చర్చలు.. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ
ఎందుకీ బ్యాన్ ?
‘‘చెస్ గేమ్‌ను మేం జూదానికి మూలంగా పరిగణిస్తున్నాం. గత సంవత్సరం తాలిబన్(Taliban Vs Chess) ప్రభుత్వం ప్రకటించిన ధర్మ ప్రచారం, దుర్మార్గ నివారణ చట్టం ప్రకారం చెస్‌ను బ్యాన్ చేశాం’’ అని ఆఫ్ఘనిస్తాన్ స్పోర్ట్స్ డైరెక్టరేట్ ప్రతినిధి అటల్ మష్వానీ చెప్పారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించే వరకు చెస్‌పై బ్యాన్ కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్‌లోని నగరాల్లో ఉన్న కేఫ్‌లలో చెస్ పోటీలు జరిగేవి. వాటి ద్వారా కేఫ్‌ల ఓనర్లు బాగానే డబ్బులు సంపాదించే వారు. సదరు కేఫ్‌ల నిర్వాహకులు చెస్ గేమ్స్‌ను ఒక జూదంలా నిర్వహిస్తున్నట్లు తాలిబన్లకు సమాచారం అందింది. దీంతో ఆ గేమ్‌ను బ్యాన్ చేయాలని నిర్ణయించారు. మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు.
Also Read :Fact Check : ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా ? జైలులోనే హత్య చేయించారా ?
వీడియో గేమ్‌లు, విదేశీ సినిమాలు, మ్యూజిక్, పబ్‌జీ
తాలిబన్లు ఇప్పటికే వీడియో గేమ్‌లు, విదేశీ సినిమాలు, మ్యూజిక్, పబ్‌జీ లాంటి గేమ్స్‌ను బ్యాన్ చేశారు. యువత, విద్యార్థులను అశ్లీలత కలిగిన కంటెంట్‌కు దూరంగా ఉంచేందుకే వీటిని బ్యాన్ చేశామని అప్పట్లో తాలిబన్లు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని రెస్టారెంట్లు, హోటళ్లలోకి మహిళలు, కుటుంబాల ప్రవేశాన్ని తాలిబన్లు బ్యాన్ చేశారు. పశ్చిమ దేశాల కల్చర్‌ను ఫాలో కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.