Chandrababu – Bail : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో అరెస్టయిన చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఉన్నారు. ఏసీబీ కోర్టుకు ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టును సమర్పించింది. 2021లో ఈ కేసుకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోయినప్పటికీ.. తాజా ఎఫ్ఐఆర్ రిపోర్టులో చంద్రబాబు పేరును చేర్చి, సవరించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందజేశారు.
Also read : Chandrababu Arrest : ఏసీబీ కోర్టులో చంద్రబాబు.. భారీగా తరలివస్తున్న టీడీపీ శ్రేణులు
ఇక బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరఫున సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లుత్రా, సీఐడీ తరపున ఏఏజీ పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. తొలుత తన ఛాంబర్ లో వాదనలను వినిపించాలని న్యాయమూర్తి కోరారు. అయితే ఓపెన్ కోర్ట్ లోనే వాదనలను వినాలని న్యాయమూర్తిని టీడీపీ లీగల్ టీమ్ (Chandrababu – Bail) కోరింది. దీంతో కోర్ట్ హాల్ లోనే వాదనలు జరుగుతున్నాయి. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also read : Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు మెడికల్ టెస్టుల ఫొటోలు