Sunita Williams : భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో థాంక్స్‌గివింగ్ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె స్మోక్డ్ టర్కీ, మాష్డ్ పొటాటోస్ వంటి ప్రత్యేక ఆహార పదార్థాలతో పండుగను జరుపుకోనున్నారు. థాంక్స్‌గివింగ్ అమెరికాలో ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం పంటల కోత సీజన్‌ను , ఇతర ఆశీర్వాదాలను స్మరించుకుంటూ జరుపుకుంటారు. సునీతా విలియమ్స్ నాసా ద్వారా బుధవారం విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడుతూ, “మా స్నేహితులు, కుటుంబ సభ్యులు, మాకు మద్దతు ఇస్తున్న ప్రతిఒక్కరికి హ్యాపీ థాంక్స్‌గివింగ్ చెప్పాలనుకుంటున్నాం” అని తెలిపారు.
ఈ సందర్భంగా నాసా వారి కోసం బటర్నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డీన్స్, స్మోక్డ్ టర్కీ వంటి ఆహార పదార్థాలను అందజేసింది. ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలియమ్స్, ఆమెతో పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇతర వ్యోమగాములు బుట్చ్ విల్‌మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ థాంక్స్‌గివింగ్ వేడుకలను ఎలా జరుపుకోబోతున్నారనే వివరాలు చెప్పారు. వీరి ప్రణాళికల్లో మేసీ థాంక్స్‌గివింగ్ డే పరేడ్ వీక్షించడం, స్మోక్డ్ టర్కీ, క్రాన్‌బెర్రీ, యాపిల్ కోబ్లర్, గ్రీన్ బీన్స్, మష్రూమ్స్, మాష్డ్ పొటాటోస్‌తో వేడుకలకు తగిన విందు ఉంటాయి.
Hyderabad to Vijayawada : హైస్పీడ్ ట్రైన్స్.. గంటలోనే హైదరాబాద్ టు విజయవాడ.. విమానం కంటే చౌక!
స్టార్లైనర్ నుంచి స్పేస్ఎక్స్ డ్రాగన్ వరకు
జూన్‌లో సునీతా విలియమ్స్ , బుట్చ్ విల్‌మోర్ బోయింగ్ అభివృద్ధి చేసిన స్టార్లైనర్ ద్వారా ప్రయాణించిన తొలి వ్యోమగాములు అయ్యారు. మొదట ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి ఉండగా, స్టార్లైనర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా వారి ప్రయాణం ఎనిమిది నెలలకు పెరిగింది. ప్రస్తుతం, సునీతా విలియమ్స్ ఫిబ్రవరి 2025లో స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా భూమికి తిరిగి రానున్నారు. వారి దీర్ఘకాలిక అంతరిక్ష వాసంపై కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, నాసా ప్రకటన ప్రకారం, “సునీతా , బుట్చ్ ఇద్దరూ అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నారు”. సునీతా విలియమ్స్ తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ, “నేను సంతోషంగా ఉన్నాను, వ్యాయామం చేస్తున్నాను, సరైన ఆహారం తీసుకుంటున్నాను” అని చెప్పారు. అంతేకాకుండా, అంతరిక్షంలో బరువు తగ్గినట్లు వచ్చిన నివేదికలను ఖండించారు.
260 మైళ్ల ఎత్తులో దీపావళి వేడుక
అంతరిక్ష కేంద్రం నుంచి 260 మైళ్ల ఎత్తులో దీపావళి కూడా జరుపుకున్న సునీతా విలియమ్స్ తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు మొత్తం 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. అంతరిక్షం నుండి ఎక్కువసార్లు స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగాముల్లో సునీతా రెండో స్థానంలో ఉన్నారు.
Nara Ramamurthy Naidu : సోదరుడి పెద్ద కర్మ సందర్భంగా నారావారిపల్లికి చేరుకున్న చంద్రబాబు