Kattalan: నటుడు సునీల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దాదాపు 200 సినిమాల్లో హాస్యనటుడిగా నటించి, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వాస్తవానికి డ్యాన్సర్ కావాలనుకున్న సునీల్, కమెడియన్‌గా అనూహ్య విజయాన్ని సాధించారు. ఆయన కామెడీ అనేక సినిమాల విజయానికి ప్రధాన కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
కమెడియన్‌గానే కాదు, హీరోగానూ తన నటనతో ఆకట్టుకున్న సునీల్, ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా అనూహ్యంగా ఎదిగారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌కు ఒక కొత్త మలుపును తీసుకొచ్చింది. ప్రస్తుతం సునీల్‌కు మరింత శక్తివంతమైన పాత్రలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే, సునీల్ మలయాళ చిత్రం ‘కట్టలన్’ లో విలన్ పాత్రలో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు పాల్ జార్జ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్-ఇండియా హై-యాక్షన్ థ్రిల్లర్‌లో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షరీఫ్ ముహమ్మద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన సునీల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఆయన పూర్తిగా కొత్త, స్టైలిష్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నారు.
MLA Maganti Gopinath Dies : గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్