మండోలి జైలు (mandoli jail) లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో లేఖను విడుదల చేశారు. జైలు నుంచి తన న్యాయవాది అనంత మాలిక్ ద్వారా సంచలన విషయాలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఢిల్లీ శాంతి భద్రతలపై మాట్లాడుతున్న సీఎం కేజ్రీవాల్, అతని సహచరులు నన్ను, నా కుటుంబాన్ని బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. నా తల్లికి ఫోన్‌చేసి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే జైలులో విషంపెట్టి నీ కొడుకును చంపేస్తామని కేజ్రీవాల్ సన్నిహితులు బెదిరించారంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో రాశారు.
కేజ్రీవాల్ దిగజారి సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శించాడు. కేజ్రీవాల్ ఇతరులను నిందించే ముందు తమని తాము చూసుకోవాలని, త్వరలో కేజ్రీవాల్ కూడా తీహార్ జైలులో చేరతాడంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాదులోని ఫార్మా కాంట్రాక్టర్ నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ముడుపులు అందాయని సుఖేష్ వెల్లడించాడు. 2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్‌లో మూడు అపార్ట్ మెంట్లు కొనుగోలు చేశాడని, వారంరోజుల క్రితం మూడు అపార్ట్ మెంట్లను కేజ్రీవాల్ అత్యవసరంగా అమ్మకానికి పెట్టాడని అన్నారు.
దుబాయ్‌లో మూడు అపార్ట్‌మెంట్‌ల కొనుగోలు లావాదేవీలపై నాకు సత్యేందర్ జైన్‌కు మధ్య జరిగిన మూడు పేజీల వాట్సాప్ చాట్‌ను త్వరలో విడుదల చేస్తానని లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ తెలిపాడు. వారంరోజుల్లో ఈడీ, అవినీతి నిరోధక విజిలెన్స్‌కి ఆధారాలు పంపిస్తానని సుఖేందర్ చెప్పాడు.
Telangana BJP: అధ్యక్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి .. బండి, ఈటల ఎడమొహం పెడమొహం