శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కర్నూలు జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ముస్తాబయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. చూసేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో భక్తులు పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని.. ఆయన సూచించారు. కాగా, బ్రహ్మోత్సవాల సన్నాహకంగా.. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వెండి రథంపై ఆలయం చుట్టూ ఊరేగించారు.
Srisailam: శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబు!

Srisailam Devasthanam