Site icon HashtagU Telugu

Worlds Largest Kidney Stone : ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్ తొలగింపు.. శ్రీలంక ఆర్మీ వైద్యుల రికార్డ్ 

Worlds Largest Kidney Stone

Worlds Largest Kidney Stone

Worlds Largest Kidney Stone : శ్రీలంక ఆర్మీ వైద్యులు కొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని సర్జరీ చేసి తొలగించారు. రాజధాని కొలంబోలోని ఆర్మీ హాస్పిటల్‌లో ఈ నెల ప్రారంభంలో జరిగిన కిడ్నీ సర్జరీలో 13.372 సెంటీమీటర్ల పొడవు, 801 గ్రాముల బరువున్న రాయిని కిడ్నీ నుంచి తీశారు.  ఈవిషయాన్నిశ్రీలంక ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ధృవీకరించింది.  “13.372 సెం.మీ (5.264 అంగుళాలు) అతిపెద్ద కిడ్నీ స్టోన్ ను(Worlds Largest Kidney Stone) జూన్ 1 కొలంబోలోని కానిస్టస్ కూంఘే లో ఉన్న ఆస్పత్రిలో తొలగించారు” అని వెల్లడించింది.

Also read : Kidney Stones: కిడ్నీలో రాళ్లను కరిగించే 7 రకాల పానీయాలు.. అవేంటంటే?

కన్సల్టెంట్ యూరాలజిస్ట్ లెఫ్టినెంట్ కల్నల్ (డా) కె. సుతర్షన్, హాస్పిటల్‌లోని జెనిటో యూరినరీ యూనిట్ హెడ్, కెప్టెన్ (డా) డబ్ల్యుపిఎస్‌సి పతిరత్న, డాక్టర్ థమాషా ప్రేమతిలక కలిసి ఈ సర్జరీ నిర్వహించారని తెలిపింది.  ఇంతకుముందు 2004లో ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ రాయిని( దాదాపు 13 సెంటీమీటర్లు) ఇండియాలో సర్జరీ ద్వారా తొలగించారు. అయితే అత్యంత బరువున్న (620 గ్రాముల) కిడ్నీ రాయిని 2008లో పాకిస్థాన్‌లో సర్జరీ చేసి తొలగించారు.

Exit mobile version