Jay Shah: జై షాకు అధికారికంగా క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం.. ఎందుకంటే..?

శ్రీలంక క్రికెట్ పతనానికి జై షా (Jay Shah) కారణమంటూ శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ వివాదాస్పద ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - November 18, 2023 / 10:53 AM IST

Jay Shah: మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సెక్రటరీ జై షాకు అధికారికంగా క్షమాపణలు చెప్పింది. శ్రీలంక క్రికెట్ పతనానికి జై షా (Jay Shah) కారణమంటూ శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ వివాదాస్పద ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

రణతుంగ ఏం అన్నాడంటే..?

ఇటీవల రణతుంగ మాట్లాడుతూ.. శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులపై జై షా ప్రభావం ఉందని రణతుంగ అన్నారు. వీరి కుమ్మక్కు కారణంగానే శ్రీలంక క్రికెట్‌ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. 1996లో శ్రీలంకను ప్రపంచకప్ విజేతగా నిలిపిన కెప్టెన్ మాట్లాడుతూ.. శ్రీలంక క్రికెట్‌ను జై షా నడుపుతున్నారు. జై షా ఒత్తిడి కారణంగా మన క్రికెట్ బోర్డు నాశనమైపోతోంది. ఓ భారతీయుడు శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నాడని ఆరోపించారు.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షాపై క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా రణతుంగ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం (నవంబర్ 17) తెలిపింది. లంక క్రికెట్ పతనానికి మరే ఇతర దేశం, వ్యక్తి లేదా సంస్థను బాధ్యులను చేయలేమని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.

Also Read: IND vs AUS Final Match Umpires : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ఐరన్ లెగ్ అంపైర్..ఏమవుతుందో అనే టెన్షన్లో ఫ్యాన్స్

పార్లమెంటు సమావేశాల సందర్భంగా మంత్రులు హరీన్ ఫెర్నాండో, కాంచన విజేసేకర మొత్తం విషయంపై విచారం వ్యక్తం చేశారు. జై షా విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనకు చింతిస్తున్నామని వారిద్దరూ అన్నారు. మేము ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిబి) చీఫ్ జై షాపై తప్పు చూపలేము. శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి)పై ఐసిసి సస్పెన్షన్‌కు సంబంధించి జై షాతో ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే టచ్‌లో ఉన్నారని హరీన్ ఫెర్నాండో తెలిపారు. ఐసీసీ నిషేధాన్ని ఎత్తివేయకపోతే ఏ జట్టు కూడా శ్రీలంకకు రాదని అన్నాడు. ప్రభుత్వ జోక్యం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఇటీవల శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి)ని సస్పెండ్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

అర్జున రణతుంగ 1982 నుండి 2000 వరకు అంటే 18 సంవత్సరాల వరకు శ్రీలంక తరపున ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ కూడా అయ్యాడు. 2008 నుండి 2009 వరకు అతను శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. రణతుంగ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. అతను శ్రీలంక ప్రభుత్వంలో నాలుగు మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించాడు. ఆయన చివరిసారిగా 2018-19లో మంత్రిగా పనిచేశారు. ఆయన అప్పుడు శ్రీలంక పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.