Site icon HashtagU Telugu

IND vs SL: శ్రీలంక (50) ఆలౌట్.. పగ తీర్చుకున్న టీమిండియా

Team India In World Cup

IND vs SL

IND vs SL: ఆసియా క‌ప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక తేలిపోయింది. మొదట బ్యాటింగ్ బరిలో దిగిన శ్రీలంకను టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను వణికించేశాడు. మొదటి వికెట్ తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా బోణి కొడితే ఆ తర్వాత సిరాజ్ బంతితో విశ్వరూపం చూపించాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ లో సిరాజ్ మొదటి బంతికి నిస్సంకని అవుట్ చేసి శ్రీలంక పతనాన్ని శాసించాడు. వరుసగా సమరవిక్రమ, అసలంక, ధనుంజయ వికెట్స్ అదే ఓవర్ లో తీసి లంక నడ్డి విరిచాడు. ఇక తన మూడో ఓవర్ లో కెప్టెన్ శనకాని డకౌట్ చేశాడు. ఆ వెంటనే కుశల్ మెండీస్ ని పెవిలియన్ చేర్చాడు. దీంతో మహ్మద్ సిరాజ్ తొలిసారి 6 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.సిరాజ్ ధాటికి శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక జట్టులో ఒక ప్లేయర్ కూడా టీమిండియా బౌలింగ్ దళం ముందు నిలువలేకపోయారు. విశేషమేంటంటే కుశల్ మెండీస్ సాధించిన 17 పరుగులే అత్యధికం. గతంలో 2000 సంవత్సరంలో ఇండియా ఇదే శ్రీలంక చేతిలో 54 పరుగులకే ఆలౌట్ అయింది. 23 ఏళ్ళ తరువాత శ్రీలంకని అంతకన్నా తక్కువ పరుగులకే ఆలౌట్ చేసి పగ తీర్చుకుంది.

Also Read: IND vs SL: చ‌రిత్ర సృష్టించిన మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. బెంబేలెత్తిన శ్రీలంక బ్యాటర్లు