Trains Cancelled : ఈనెల 11 వరకు ఈ రైళ్లు రద్దు.. సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడి

Trains Cancelled :  విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ లతో ముడిపడిన మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 08:27 AM IST

Trains Cancelled :  విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ లతో ముడిపడిన మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. దీంతో ఈ రూట్ లో నడిచే కొన్ని రైళ్లను తాత్కాలికంగా క్యాన్సల్ చేశారు. ఈవిషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

Also read : Today Horoscope : సెప్టెంబరు 4 సోమవారం రాశి ఫలాలు.. వారు ఆవేశపడితే అనర్ధం

  • గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును సెప్టెంబరు 5 నుంచి 10 వరకు క్యాన్సల్ చేశారు.
  • విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును సెప్టెంబరు 6 నుంచి 11 వరకు క్యాన్సల్ చేశారు.
  • విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబరు 5, 6, 8, 9 తేదీల్లో క్యాన్సల్  చేశారు.
  • గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (17243), మచిలీపట్నం-విశాఖపట్నం (17219), విశాఖపట్నం-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను ఈ నెల 9 వరకు క్యాన్సల్ చేశారు.
  • లింగంపల్లి-విశాఖపట్నం (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, రాయగడ-గుంటూరు (17244), విజయవాడ-విశాఖపట్నం (12718), విశాఖపట్నం-విజయవాడ (12717) రత్నాచల్‌లను ఈనెల 10 వరకు క్యాన్సల్ (Trains Cancelled)  చేశారు.
  • తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ ను 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుపుతారు.
  • విశాఖలో బయల్దేరాల్సిన విశాఖపట్నం-తిరుపతి (22707) రైలు 7, 9 తేదీల్లో సామర్లకోట స్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది.