Site icon HashtagU Telugu

Sonia Gandi : కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ..ఏమన్నారంటే..!

Sonia Gandhi letter to Konda Surekha..what does it say..!

Sonia Gandhi letter to Konda Surekha..what does it say..!

Sonia Gandi : ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు లేఖ రాశారు. ఈ సందర్భంగా కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు సోనియా ప్రశంసించారు. 42 సంవత్సరాల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయం అన్న సోనియా గాంధీ.. త్రివేణి సంగమం జలాలకి ఎంతో ప్రత్యేకత ఉందని ప్రస్తావించారు. తనకి కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి స్థల విశిష్టతను, ప్రశస్థను తెలియజేసినందుకు కొండా సురేఖను సోనియా గాంధీ అభినందించారు.

Read Also:YCP : మరోసారి వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్ 

తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత నెలలో మూడు రోజుల పాటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి 42 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం జరిగింది. ఈ మహా ఘట్టం కోసం దేవాదాయ, ఇతర శాఖల అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లను చేశారు. 1982లో చివరిసారిగా కాళేశ్వరుడి కుంభాభిషేకం నిర్వహించారు. నాటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల ఆధ్వర్యంలో క్రతువును జరిపించారు. ప్రస్తుతం 42 ఏళ్లకు మహాఘట్టం జరిగింది. ఇప్పుడు కూడా శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో జరగడం విశేషం.

కాగా, 1982లో మొదటిసారి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ జరిగిన సమయంలో ఇక్కడ మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ 42 ఏళ్ల తర్వాత గత నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహాకుంభాభిషేక వేడుకలను నిర్వహించారు. తుని తపోవన ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామి, ఆయన శిష్య బృందం, రుత్విజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 1,108 కలశాలకు పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రు లు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ హాజరు కాగా, వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాళేశ్వర ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవం 43 ఏళ్ల తర్వాత నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభామేళా జరుగుతున్న తరుణంలోనే కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో మహా కుంబాభిషేకం జరిగింది.

Read Also: Steve Smith Net Worth: స్టీవ్ స్మిత్ సంపాద‌న ఎంతో తెలుసా.. దాదాపు రూ. 250 కోట్లు?