Sonia Gandhi Hospitalised: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో (Sonia Gandhi Hospitalised) చేర్పించారు. ఆసుపత్రి యాజమాన్యం జారీ చేసిన ప్రకటన ప్రకారం.. సోనియా గాంధీని గ్యాస్ట్రో విభాగంలో చేర్పించార. ఆమె కడుపుతో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
ఆసుపత్రి వర్గాల ప్రకారం.. సోనియా గాంధీకి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆమె పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు. చికిత్సను నిపుణుల వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఆమె ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఆమె ఆరోగ్యం గురించి వార్తలు అందిన వెంటనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకోవడం ప్రారంభించారు. పార్టీ తరపున కూడా సోనియా గాంధీ ఆరోగ్యం గురించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మరోసారి క్షీణించటం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళనను పెంచింది. గత కొన్ని రోజుల క్రితం కూడా సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించి సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్, ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆ తర్వాత ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సర్ గంగారామ్ ఆసుపత్రి ప్రకటన
సర్ గంగారామ్ ఆసుపత్రి సోనియా గాంధీ ఆరోగ్యం గురించి ప్రకటన విడుదల చేసింది. ఆసుపత్రి తరపున విడుదల చేసిన ప్రకటనలో.. “కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. కడుపుతో సంబంధిత సమస్య కారణంగా ఆమెను గ్యాస్ట్రో విభాగంలో ఉన్నారు. ఆమె పరిశీలనలో ఉన్నారు” అని తెలిపారు.
Also Read: WTC 2025-27 Schedule: డబ్ల్యూటీసీ 2025-27 పూర్తి షెడ్యూల్ ఇదే.. 9 జట్లు మొత్తం 71 మ్యాచ్‌లు!
సిమ్లాలో ఆరోగ్య పరీక్ష ఎందుకు?
జూన్ 7న కూడా సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్, ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆ తర్వాత ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అది సాధారణ ఆరోగ్య పరీక్ష అని చెప్పారు. ఆ సమయంలో హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య మంత్రి ధనీ రామ్ షాండిల్ మాట్లాడుతూ.. ‘‘సోనియా గాంధీకి అధిక రక్తపోటు ఫిర్యాదు ఉన్నందున సిమ్లా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం చాలా బాగుంది. ఇది కేవలం సాధారణ పరీక్ష మాత్రమే. ఆందోళనకరమైన విషయం ఏమీ లేదు’’ అని తెలిపారు.