బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయ్ కుమార్ అనే వ్యక్తి తన ముఖాన్ని ప్లాస్టిక్ కవర్‌తో కప్పుకుని నైట్రోజన్ గ్యాస్ పీల్చుకున్నాడు. ఈ ఘటన మహాలక్ష్మి లేఅవుట్ కురుబరహళ్లి జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఆత్మహత్య చేసుకునేందుకు నైట్రోజన్ సిలిండర్ కొనుగోలు చేశాడని.. సిలిండర్‌ను తన కారు వద్దకు తీసుకెళ్లి, వాహనంపై బెడ్‌షీట్‌తో కప్పి, తన కారు వెనుక సీటులో కూర్చున్నాడని పోలీసులు తెలిపారు. విజయ్ తన మెడకు పాలిథిన్ కవర్ చుట్టి, ముఖాన్ని కప్పి, పైపును సిలిండర్‌కు కనెక్ట్ చేసి, పాలిథిన్ కవర్‌లోకి గ్యాస్ వదిలాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు వెంటనే మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా విజయ్ ప్రాణాలతో పోరాడుతున్నట్లు గుర్తించారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడు తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
Software Engineer Suicide : బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Death Representative Pti