Plane Crash: పొలంలో కూలిన విమానం.. ఆరుగురి మృతి

Plane Crash : ఆ విమానం జర్నీ అప్పటిదాకా సాఫీగా సాగింది..అయితే కాసేపటికే ఏదో జరిగింది.. 

Published By: HashtagU Telugu Desk
Emergency Landing

Emergency Landing

Plane Crash : ఆ విమానం జర్నీ అప్పటిదాకా సాఫీగా సాగింది..

అయితే కాసేపటికే ఏదో జరిగింది.. 

వాతావరణం సడెన్ గా  మారింది..  

విమానం పైలట్ కు మార్గం సరిగ్గా కనిపించలేదు ..

అతడు విమానం పై కంట్రోల్ కోల్పోయాడు.. 

ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కావాల్సిన విమానం .. ఎయిర్ పోర్ట్ దాటేసింది.. 

ఎయిర్ పోర్ట్ అవతల ఉన్న ఒక పొలంలో కుప్పకూలి పేలిపోయింది.. 

ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.

పెద్దఎత్తున చెలరేగిన మంటలకు దాదాపు  ఎకరం పొలం కాలి బూడిదైంది. 

Also read : Eats Wife’s Brain: మెక్సికోలో షాకింగ్ ఘటన.. భార్యను హత్య చేసి మెదడు తిన్న భర్త

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ముర్రియేటా నగరంలోని విమానాశ్రయానికి సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం గమ్యస్థానాన్ని చేరుకోకముందే కూలిపోయింది.  ఇది సెస్నా C550 రకానికి చెందిన  బిజినెస్ జెట్. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు ఇంకా  వెల్లడి కాలేదు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, ఫెడరల్  ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తున్నాయి. 15 రోజుల్లో ప్రాథమిక నివేదిక వస్తుంది. తెల్లవారుజామున 4.16 గంటలకు  ఈ విమానం బయలుదేరిన టైంలో పొగమంచు ఎక్కువగా ఉండటం వల్ల .. పైలట్ ఎయిర్ పోర్ట్ ల్యాండింగ్ సైట్ ను గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.  ఇందువల్లే విమానం రన్‌వే నుంచి కొన్ని వందల గజాల దూరంలోని పొలం వైపు(Plane Crash) వెళ్లి ఉండొచ్చని అంటున్నారు.

  Last Updated: 09 Jul 2023, 07:08 AM IST