Shobha Karandlaje: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జరిగిన భయానక తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఈ విషాదకర ఘటనపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఒక సినిమాకి సంబంధించిన థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోతే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు కదా? అక్కడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనే ఉంది. మరి ఇక్కడ 11 మంది చనిపోతే మాత్రం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మౌనంగా ఎందుకు ఉన్నారు?” అంటూ ప్రశ్నించారు.
Fake Gold: నకిలీ బంగారు ఆభరణాలను కుదవ పెట్టి రూ. 43 లక్షల లోన్
శోభా కరంద్లాజే తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ… “ఇటువంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంటే, కనీసం బాధ్యత వహించాలనే బుద్ధి లేదు. డీకే శివకుమార్ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమం ఘోరంగా విఫలమైంది. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణమే రాజీనామా చేయాలి. ప్రజల ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు” అంటూ మండిపడ్డారు.
Trump: ట్రంప్ ట్రావెల్ బ్యాన్.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
RCB విజయం సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చిన వేళ, చక్కటి భద్రతా చర్యలు లేకపోవడమే ఈ విషాదానికి కారణమని ఆమె ఆరోపించారు. స్టేడియంలో గేట్లు ఒక్కసారిగా తెరవడం, ఆందోళనకర స్థితిని ఊహించలేకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను లైట్‌గా తీసుకుందంటూ, “ఒక పార్టీ విజయోత్సవాల పేరుతో 11 కుటుంబాల్లో శోకాన్ని నింపడం ఎంత దారుణం? ఇది కేవలం నిర్వాహక లోపం కాదు.. ఇది ఒక అపరాధం. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయ పబ్లిసిటీ కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆపాలి” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.