Site icon HashtagU Telugu

AP SI Jobs: ఏపీ ఎస్సై ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల!

Section 30 Of Police Act

Section 30 Of Police Act

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. 411 పోస్టులకు గాను ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు లక్షా 51 వేల 288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57 వేల 923 మంది అర్హత సాధించారు. అభ్యర్థుల నుంచి 15 వందల 53 అభ్యంతరాలను స్వీకరించినట్లు రిక్రూట్‌మెంట్‌బోర్డు తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్‌ షీట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

Also Read: NTR’s Coin: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం ఇదే!