IPL 2023 Qualifier 2: ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌ను ముందుగా బ్యాటింగ్ చేయమని కోరాడు. ముందుగా బ్యాటింగ్ బరిలో దిగిన గుజరాత్ ఆటగాళ్లు శుభారంభాన్నిచ్చారు. ఇప్పటికే ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక్కో బౌలర్ నుంచి అద్భుతమైన పరుగులు రాబట్టడంలో గిల్ తన ప్రతాపం చూపించాడు. ఈ సమయంలో ముంబై ఆటగాడు టిమ్ డేవిడ్ భారీ మిస్టేక్ వల్ల గిల్ చెలరేగిపోయాడు. (IPL 2023 Qualifier 2)
Shubman Gill hits 3rd hundred In 2023 IPL
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) ఆరంభం నుండి పసందైన పరుగులు రాబట్టగలిగాడు. భారీ షాట్లతో ముంబై బౌలర్లను ఆడుకున్నాడు. అయితే గిల్ ని కట్టడి ఛాన్స్ ను ముంబై చేతులారా వదులుకుంది. ఆరో ఓవర్ ఐదో బంతికి క్రిస్ జోర్డాన్ వేసిన బంతిని గిల్ గాలిలో ఆడాడు. మిడ్ ఆన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ డేవిడ్ (Tim David) డైవ్ క్యాచ్ పట్టుకోలేకపోయారు. టిమ్ డేవిడ్ చేసిన ఈ తప్పిదం ముంబై ఇండియన్స్‌కు చాలా నష్టం జరిగింది. ఒకవేళ టిమ్ డేవిడ్ ఆ క్యాచ్ పట్టి ఉంటె గిల్ 30 (30 Runs) పరుగులకే ఔటయ్యేవాడు. దాంతో గిల్ ధాటిగా ఆడాడు. ఈ ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీ కొట్టి 129 భారీ స్కోర్ చేయగలిగాడు. ఐపీఎల్ 2023లో గిల్ మూడుసెంచరీలు సాధించాడు.
This is madness from Shubman Gill. pic.twitter.com/HqjLYZnRBN
— Johns. (@CricCrazyJohns) May 26, 2023
టైటిల్‌ను కాపాడుకునేందుకు గుజరాత్ టైటాన్స్‌కు ఇదే చివరి అవకాశం. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాలంటే హార్దిక్ పాండ్యా సేన ముంబై ఇండియన్స్‌పై గెలవాలి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గత సీజన్‌లో గుజరాత్ ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది.
Read More: IPL 2023 Qualifier 2: క్వాలిఫయర్ మ్యాచ్‌లో గిల్ ఉగ్రరూపం.. గిల్ సెంచరీతో రోహిత్ శభాష్