సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వెస్టిండీస్ పై టీ ట్వంటీ, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్ తాజాగా శ్రీలంకపైనా షార్ట్ ఫార్మేట్ లో సిరీస్ కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. గుణలతిక , నిస్సాంక తొలి వికెట్ కు 67 పరుగులు జోడించారు. మిడిలార్డర్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగినా… నిస్సాంకకు తోడుగా కెప్టెన్ శనక మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో లంక భారీ స్కోరే సాధించింది. కెప్టెన్ శనక కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. నిస్సాంక 75 , గుణలతిక 38 పరుగుల చేశారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది.
ఛేజింగ్ లో ఈ సారి భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది.రోహిత్ శర్మ 1 , ఇషాన్ కిషన్ 16 పరుగులకే ఔటవగా.. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశారు. అయ్యర్ కేవలం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేయగా… శాంసన్ 39 రన్స్ కు ఔటయ్యాడు. తర్వాత జడేజా చెలరేగిపోవడంతో భారత్ 17.1 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. జడేజా కేవలం 18 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 45 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది. సిరీస్ లో మూడో మ్యాచ్ ఆదివారం ధర్మశాలలోనే జరుగుతుంది.
Pic Courtesy- BCCI/Twitter
11th T20I win on the bounce for #TeamIndia 👏👏@Paytm #INDvSL pic.twitter.com/zsrm3abCls
— BCCI (@BCCI) February 26, 2022