Site icon HashtagU Telugu

Acid: విజ‌య‌వాడ‌లో దారుణం.. వాట‌ర్ బాటిల్ అడిగితే యాసిడ్ ఇచ్చి!

Water

Water

విజ‌య‌వాడ‌లో దారుణం చోటుచేసుకుంది. ఎనికేపాడులో ఓ డిగ్రీ విద్యార్థి వాట‌ర్ బాటిల్ కోసం షాపుకు వెళ్ల‌గా వ్యాపారి వాట‌ర్ బాటిల్‌కు బదులుగా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దీంతో వాట‌ర్ అనుకుని ఆ విద్యార్థిని యాసిడ్ తాగి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైయ్యాడు ఘ‌ట‌న జ‌రిగిన వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించిందని చికిత్స మొదలుపెట్టారు. లయోల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పరిస్థితికి జాలిపడిన కాలేజీ యాజమాన్యం, తోటి విద్యార్థులు విరాళాలు సేకరించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version