Site icon HashtagU Telugu

Tirumala: తిరుమలలో తీవ్ర విషాదం.. చిన్నారిని చంపేసిన చిరుత

Tirumala Alipiri

Tirumala Alipiri

తిరుమలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అలిపిరి నడకదారిపై చిరుత పసికందుపై దాడి చేసి దారుణంగా చంపేసింది. అలిపిరి నడకదారిలో తిరుమలకు వస్తుండగా నరసింహస్వామి ఆలయం సమీపంలో శుక్రవారం రాత్రి రక్షిత అనే పాప అదృశ్యమైందని.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శనివారం ఉదయం నరసింహస్వామి గుడి సమీపంలో రక్షిత మృతదేహం లభ్యమైంది. తలపై బలమైన గాయాలు ఉన్నాయి. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

దినేష్ కుటుంబ సభ్యులు అలిపిరి నడకదారి మీదుగా తిరుమలకు బయలుదేరారు. ఈ క్రమంలో నరసింహస్వామి గుడి సమీపంలో రక్షిత కనిపించకపోవడంతో.. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనలో పాప కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. సోషల్ మీడియాలో కూడా పాపకు సంబంధించిన సమాచారం ప్రచారంలోకి వచ్చింది. అయితే పాప ఎక్కడా కనిపించలేదు. రాత్రి పసికందుపై చిరుత దాడి చేసి హత్య చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులతో వెళ్తున్న పాప ఎలా తప్పిపోయిందో తెలియరాలేదు.

ఎలుగుబంటి దాడితోనే : పోలీసుల అనుమానం

అయితే చిన్నారిపై చిరుత దాడి చేసిందని మొదట పోలీసులు భావించారు.. కానీ ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఫారెస్ట్ అధికారులు తిరుపతి రుయాలో పాప మృతదేహాన్ని పరిశీలించారు. పాప ఒంటిపై గాయాలను బట్టి.. దాడి జరిగిన విధానాన్ని బట్టి ఎలుగుబంటిగా అనుమానిస్తున్నారు.

గతంలో బాలుడిపై దాడి

రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలుడిపై కూడా చిరుత దాడి చేసింది. బాలుడిని తన తాతతో కలిసి ఓ దుకాణం దగ్గర ఆపి అటవీ ప్రాంతంలోకి లాగారు. అటవీ ప్రాంతం వైపు వెళ్లాయి.. ఈ క్రమంలో చిరుత బాలుడిని దగ్గర వదిలేసింది. బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతడు కోలుకున్నాడు. దాడి ఘటన జరిగిన వెంటనే అటవీశాఖ అధికారులు, టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.. చిరుతను తీసుకెళ్లి సుదూర అటవీ ప్రాంతంలో వదిలేశారు. చిరుత అదృశ్యమైందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు చిరుత బాలికను చంపడం కలకలం రేపుతోంది.

టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేది : చంద్రబాబు

‘‘కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పాప తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కొద్దిరోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన జరిగింది. ఈ కారణంగా అయినా టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేది. అధికారులు సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరించి, తగు రక్షణతో భక్తుల భయాన్ని తొలగించాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Also Read: MLC Kavitha: మహిళా బిల్లు పాస్ చేసి బీజేపీ తన చిత్త శుద్ది నిరూపించుకోవాలి

Exit mobile version