Site icon HashtagU Telugu

Shoaib Malik Marries Sana Javed: మరో పెళ్లి చేసుకున్న సానియా భర్త.. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులపై క్లారిటీ..!

Shoaib Malik Extramarital Affairs

Safeimagekit Resized Img (3) 11zon

Shoaib Malik Marries Sana Javed: మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహంలో విభేదాలు చాలా కాలంగా వార్తల్లో ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు షోయబ్ మాలిక్ మ‌రో పెళ్లి చేసుకున్నాడని (Shoaib Malik Marries Sana Javed) వార్త‌లు వ‌స్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మ‌రో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాతో విడిపోయారనే వార్తలు వస్తున్న తరుణంలో ఈ పెళ్లి జరిగింది. షోయబ్ మాలిక్ తన జీవిత భాగస్వామిగా పాకిస్థానీ నటి సనా జావేద్‌ను ప‌రిచ‌యం చేశాడు. షోయబ్ మాలిక్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను పోస్ట్ చేశాడు.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఊహించని షాక్‌ తగిలింది. సానియా భర్త, పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాతో విడిపోయారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో పాకిస్థాన్‌ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ షేర్ చేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: IND vs ENG Test: జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. ప్రాక్టీస్‌కు విరాట్ కోహ్లీ దూరం..!

షోయబ్ పెళ్లి చేసుకున్న సనా జావేద్ కూడా విడాకులు తీసుకుంది. పాకిస్థాన్‌లోని ప్రముఖ నటీమణులలో ఒకరైన సనా జావేద్ 2020లో ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట మధ్య అంతా సరిగ్గా జరగడం లేదని వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరి ఫొటోలను ఒకరు డిలీట్ చేయడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. 28 ఏళ్ల సనా జావేద్ పాకిస్థాన్‌లోని అనేక టీవీ షోలలో కనిపించింది. ఆమె ఏ ముష్త్-ఎ-ఖాక్, డంక్‌తో సహా అనేక ప్రసిద్ధ షోలతో వెలుగులోకి వ‌చ్చింది. ఆమె చాలా మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది.

We’re now on WhatsApp. Click to Join.

షోయబ్ 2010లో సానియాను పెళ్లాడాడు. అప్పుడు అయేషా సిద్ధిఖీ ముందుకు వచ్చి షోయబ్ మొదటి భార్య అని, ఆమెతో విడాకులు తీసుకోకుండా అతను మళ్లీ పెళ్లి చేసుకోలేనని అందరితో చెప్పింది. ఆ సమయంలో అయేషాతో ఎలాంటి సంబంధం లేదని షోయబ్ కొట్టిపారేశాడు. అయితే విషయం తీవ్రరూపం దాల్చడంతో ఆయేషాకు విడాకులు ఇచ్చాడు. సానియాను పెళ్లి చేసుకున్న తర్వాత షోయబ్ తన మొదటి భార్య అయేషాకు విడాకులు ఇచ్చాడు.

షోయబ్ మాలిక్ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. అతను 287 వన్డే మ్యాచ్‌లలో 258 ఇన్నింగ్స్‌లలో 7534 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే.. అతను 35 టెస్ట్ మ్యాచ్‌లలో 3 సెంచరీలతో సహా 1898 పరుగులు చేశాడు. 44 అర్ధ సెంచరీలు ఉన్నాయి. T20 మ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటే.. అతను 124 మ్యాచ్‌లలో 2435 పరుగులు చేశాడు. 75 అతని అత్యధిక స్కోరు.