Shah Rukh Khan: సినిమా రంగంలో తరాలకు మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తారు.సినిమా రెమ్యూనరేషన్ నుంచి ఇతరత్రా కార్యక్రమాలు అన్నీ మేనేజర్ చూసుకుంటారు. ప్రొఫెషనల్ గానే కాకుండా పర్సనల్ గా కూడా తమ బాస్ లకు పని చేయాల్సి ఉంటుంది. పరిశ్రమలో మగవారు మాత్రమే కాదు మహిళలు కూడా మేనేజర్లుగా ఉన్నారు.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ. ఈమె షారుక్ కు 2012 నుండి మేనేజర్ గా ఉన్నారు. షారుక్ లేచిన మొదలు నిద్రపోయే వరకు పూజా షెడ్యూల్ చేస్తుంది. మీటింగ్స్, సినిమాలు, ఫంక్షన్స్ ఇలా అన్ని తానే దగ్గరుండి చూసుకుంటుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సహా అతని వ్యాపారాల కార్యకలాపాలను ఆమె పర్యవేక్షిస్తుంది. న్యాయపరమైన విషయాలతో సహా అతని వృత్తిపరమైన వ్యవహారాలను చూస్తుంది.
కథనాల ప్రకారం పూజా దద్లానీ ఏడాదికి 7 నుంచి 9 కోట్లు ఆర్జిస్తోంది.ఆమె నికర విలువ సుమారు రూ. 50 కోట్లుగా అంచనా. ఆమెకు ముంబైలో విలాసవంతమైన కోట్లాది రూపాయల ఇళ్ళు ఉంది.
Also Read: Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం పట్టివేత