Site icon HashtagU Telugu

Sexual Abuse : హైదారాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై..?

Abuse Imresizer

Abuse Imresizer

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు రజనీ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్ పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్‌లోకి తరచూ ప్రవేశిస్తున్నాడని.. ద్యార్థినులను అనుచితంగా తాకడం ద్వారా వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడని త‌ల్లిదండ్రులు ఆరోపించారు. పాఠ‌శాల‌లో చ‌దువుతున్న ఒక బాలిక తన తల్లిదండ్రులకు ఈ విష‌యం గురించి ఫిర్యాదు చేసింది, పాఠశాలలో రజనీ కుమార్‌పై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో, ఆమె తల్లిదండ్రులు మరియు బంధువులు డీఏవీ పాఠశాలకు చేరుకున్నారు. వారు డ్రైవర్‌ను పట్టుకుని కర్రలతో కొట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు పాఠశాలకు చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version