Delhi Assembly Elections : అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టిదెబ్బ తగిలింది. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి శుక్రవారంనాడు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ పంపించారు. ఈ ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించకపోవడంతోనే.. పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తోందని.. ఆ లేఖలో ఎమ్మెల్యేలు వెల్లడించారు. గతంలో ఆప్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ ఏడుగురికి ఈసారి , ఇవ్వకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో భావనా గౌర్ (పాలం), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్‌లాల్ (కస్తూర్బా నగర్), రోహిత్ కుమార్ మెహ్రౌలియా (త్రిలోక్‌పురి), భూపిందర్ సింగ్ జూన్ (బిజ్వాసన్), నరేష్ యాదవ్ (హెహ్రౌలి) పవన్ కుమార్ శర్మ (ఆదర్శ్ నగర్) ఉన్నారు. నరేష్ యాదవ్ శుక్రవారంఉదయం తన రాజీనామాను ప్రకటించడంలో పార్టీలో అంతర్గత కలహాలు ముదిరినట్టు ఊహాగానాలు మొదలయ్యారు. అయితే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం పార్టీకి గట్టిదెబ్బగా అంచనా వేస్తున్నారు.
కాగా, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మాత్రం వేరే పార్టీలో చేరే అవకాశాలపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు, ఎమ్మెల్యేల సామూహిక రాజీనామాపై ఆప్ సైతం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, సామూహిక రాజీనామాలతో కీలక నియోజకవర్గాల్లో ఆప్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
Read Also: DDCA Felicitates Virat Kohli: అప్పుడు కోహ్లీని మర్చిపోయిన ఢిల్లీ.. ఇప్పుడు ప్రత్యేక గౌరవం!