Tihar Jail Murder: పోలీసుల సమక్షంలోనే టిల్లూ హత్య: వైరల్ వీడియో

దేశ రాజధాని ఢిల్లీలోని తిహార్ జైలులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో ప్రత్యర్థి ఖైదీలు చేసిన దాడిలో టిల్లు ప్రాణాలు కోల్పోయాడు

Published By: HashtagU Telugu Desk
Tihar Jail Murder

Whatsapp Image 2023 05 05 At 5.42.37 Pm

Tihar Jail Murder: దేశ రాజధాని ఢిల్లీలోని తిహార్ జైలులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో ప్రత్యర్థి ఖైదీలు చేసిన దాడిలో టిల్లు ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యర్థులు మంగళవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో ఇనుప రాడ్లతో 100 సార్లు కసితీరా కొట్టిచంపారు. అయితే టిల్లు హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ గ్యాంగ్ స్టార్ హత్యపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తీహార్ జైలులో సునీల్ అలియాస్ టిల్లు తాజ్‌పురియా హత్యకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట రిలీజ్ అయిన వీడియోలో భద్రతా సిబ్బంది లేని సమయంలో నిందితులు టిల్లును పొడిచి చంపినట్లు కనిపించింది. రెండవ వీడియోలో నిందితులు సుమారు 10 మంది భద్రతా సిబ్బంది సమక్షంలో టిల్లుపై దాడి చేసి హత్య చేశారు. ఆ సమయంలో తమిళనాడు పోలీసులు, జైలు సిబ్బంది నిందితులని నివారించడం పోయి ప్రాణభయంతో వెనకడుగేశారు. అయితే నిందితులకు ఎవరికీ నియంత్రణ లేదని వీడియో చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియోలో తమిళనాడు పోలీసు సిబ్బంది టిల్లూను వార్డు ప్రాంగణం నుండి ఎత్తుకొని బయటకు తీసుకెళుతున్నారు. రెండు కారిడార్ల మధ్య ఒక తలుపు ఉంది. అప్పటికే నిందితులు యోగేష్, దీపక్, రియాజ్ మరియు రాజేష్ ఈ తలుపు వద్ద ఉన్నారు. యోగేష్, దీపక్‌లు సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకుని టిల్లుపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా తమిళనాడు పోలీసు సిబ్బంది మౌనంగా ఉండిపోయారు. ఒకరిద్దరు వ్యక్తులు శాంతింపజేసేందుకు ప్రయత్నించినా నిందితుడిపై ఎలాంటి ప్రభావం పడలేదు.

Read More: Custody Trailer: పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన చైతూ, కస్టడీ ట్రైలర్ ఇదిగో!

  Last Updated: 05 May 2023, 05:44 PM IST