Schools: పాఠశాలలకు ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందే…లేదంటే చర్యలు తప్పవు..!!

తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో అన్నీ పరీక్షలు నిర్వహించారు. ఈ మధ్యే వాటి రిజల్ట్స్ కూడా విడుదల అయ్యాయి. ఈనెల నుంచి పాఠశాలలను పున:ప్రారంభించారు.

Published By: HashtagU Telugu Desk
Massive influx of students from private schools to government schools in AP.

Massive influx of students from private schools to government schools in AP.

తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో అన్నీ పరీక్షలు నిర్వహించారు. ఈ మధ్యే వాటి రిజల్ట్స్ కూడా విడుదల అయ్యాయి. ఈనెల నుంచి పాఠశాలలను పున:ప్రారంభించారు. ఏపీ విషయానికొస్తే..2022-2023 విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యింది. జూలై 5 నుంచి 2023 ఏప్రిల్ వరకు పాఠశాలలు జరగనున్నాయి.

అయితే ప్రతి రెండో శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు రోజుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని…ఈ మేరకు అన్ని పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది. ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించినట్లయితే.. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

  Last Updated: 07 Jul 2022, 07:37 AM IST