Bakrid 2024: బక్రీద్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు

త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది బక్రీద్ కు ఏకంగా నాలుగు రోజులు సెలవులను ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం బక్రీద్ నాడు మాత్రమే సెలవును ప్రకటించింది.

Bakrid 2024: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది బక్రీద్ కు ఏకంగా నాలుగు రోజులు సెలవులను ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం బక్రీద్ నాడు మాత్రమే సెలవును ప్రకటించింది.

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు నాలుగు సెలవులు ప్రకటించారు. జూన్ 15 నుంచి 18 వరకు చాలా ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. అయితే తెలంగాణ సర్కారు మాత్రం ఒక్కరోజు మాత్రమే సెలవు ప్రకటించింది.బక్రీద్ సెలవుల అనంతరం హైదరాబాద్‌లోని పాఠశాలలు జూన్ 19న పునఃప్రారంభం కానున్నాయి.హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు బక్రీద్‌కు జూన్ 17 సోమవారం సెలవు.

ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లో 12వ నెల అయిన దుల్ హిజ్జా 10వ తేదీన బక్రీద్ జరుపుకుంటారు. మసీదులు మరియు ఈద్గాలలో నమాజ్ చేసిన తర్వాత వేడుకలు ప్రారంభమవుతాయి.

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫై పెద్ద బాధ్యతలు పెట్టిన చంద్రబాబు..సినిమాలు చేస్తాడా మరి..?