Firecracker: బాణాసంచా పేల్చడాన్ని వ్యతిరేకిస్తూ తాము జారీ చేసిన ఆదేశాలు కేవలం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లకే కాకుండా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాయు మరియు శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. ప్రజలను చైతన్యవంతులను చేయడమే కీలకమని కోర్టు పేర్కొంది.
భారతదేశంలో బాణాసంచా అమ్మకాలు, కొనుగోలు, వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్ మాట్లాడుతూ పర్యావరణానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కేవలం కోర్టు బాధ్యత మాత్రమేననే మరే ఉద్దేశం లేదని పార్కోన్నారు.
Also Read: world cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..హెడ్ డకౌట్